5, నవంబర్ 2016, శనివారం

ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా .....

విని తరించితిమి నీ విమల బోధల సుధలు
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా

నిన్ను నమ్మిన వాళ్ళు నిజ జీవితాలలో
ఎదైరైన కష్టాల నెదిరి గట్టెక్కుదురు      /విని/

కల్మషము లేని నీ కరుణా కటాక్షాల
తడిసిన యెల్లరు తరియించ గలరు     /విని/

చేతులు జోడించి నీ చెంత జేరిన వాళ్ళ
భద్రతల బాధ్యతలు భరియించెదవు     /విని/

నిన్ను మది మందిరములలో నిలిపి నిశ్చింతగా
నెమ్మది హాయిగా నిదుర వోదుమురా     /విని/


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి